తెలంగాణలో ప్రసిద్ది గాంచిన కొండగట్టు అంజన్న స్వామి ఆలయంలో కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కుమార్ మొక్కులు తీర్చుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గెలిస్తే నీ కొండకు వస్తానని కొండగట్టు అంజన్నను వేడుకున్నారు.ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో నిన్న ఉదయం తన ఇంటి నుంచి కాలినడకన బయలుదేరారు.
తొలుత కరీంనగర్ మహాశక్తి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం కాలినడక ప్రారంభించారు. కొత్తపల్లి, రామడుగు, గంగాధర, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలాల మీదుగా దాదాపు 37 కిలోమీటర్ల దూరాన్ని నడిచి రాత్రి 7 గంటలకు కొండగట్టు అంజన్న సన్నిధికి చేరుకుని మొక్కు చెల్లించుకున్నారు.
అసెంబ్లీ, సెక్రటేరియట్ నిర్మాణాలపై లోక్ సభలో ప్రస్తావిస్తా: ఉత్తమ్