telugu navyamedia
తెలంగాణ వార్తలు

రాజకీయ సమీకరణలమార్పుకు ఈటెల శ్రీకారం..

తెలంగాణలో రాజకీయ సమీకరణల మార్పునకు బీజేపీ శ్రీకారం చుట్టింది. ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అమలుచేస్తున్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తెలంగాణలో పార్టీ పటిష్టతకు బాధ్యతలను తీసుకున్నారు.

ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక సెంటర్లో బీజేపీ శ్రేణులు మరియు బిసి సంఘ నేతలు ఈటెల రాజేందర్ ను ఘనంగా స్వాగతించారు. పూలవర్షం కురిపించి బస్టాండ్ సెంటర్లో స్వాగత సత్కారాలతో అభిమానాన్ని చాటుకున్నారు. ఈటెల రాజేంద్రర్ సారపాక సెంటర్ కి చేరుకోగానే ఒక్కసారిగా నినాదాలు చేస్తూ బీసీల పులిబిడ్డ అంటూ జై ఈటెల రాజేందర్ అంటూ నినాదాలు చేశారు. ఆయనకు పూలమాలలుతో శాలువా కప్పి ఘనంగా స్వాగతం పలికారు.

మహిళలు నేతలుఆయనకి విజయ తిలకం దిద్ది స్వాగతం పలికారు. ఆయన అభివాదం చేస్తూ చిరునవ్వుతో భద్రాచలం రామయ్య దర్శించుకోవడానికి వెళ్లారు. భద్రాచలం రామయ్య దర్శించుకుని అనంతరం ఎస్ సి, ఎస్ టి ,బీసీ సంఘాల నేతలతో సమావేశంలో పార్టీ పటిష్టతకు కార్యకర్తలను సన్నద్ధంచేయనున్నారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ… టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు చోటులేదని..కేవలం భజన పరులకు మాత్రమే చోటు ఉందంటూ హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బడుగు బలహీన వర్గాలను టిఆర్ఎస్ పార్టీ పట్టించుకోదని మండిపడ్డారు. ఈ తెలంగాణ నగర్ లో నివాసం ఉండేది నిరుపేదలని.. అందుకే వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం లేదని ఫైర్‌ అయ్యారు ఈటల రాజేందర్‌. ధనవంతులు, బ్రోకర్లు, వందల ఎకరాలు ఆక్రమించుకున్న వాళ్లకు కేసీఆర్‌ వత్తాసు పలుకుతాడని ఆగ్రహించారు.

ప్రభుత్వ స్థలంలో ఇల్లు నిర్మించుకుంటే పట్టాలు ఇవ్వలేని కేసీఆర్… డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏమిస్తాడని ప్రశ్నించారు ఈటల. తెలంగాణ లో అధికారంలోకి వచ్చేది బీజేపీ పార్టీనేనని స్పష్టం చేశారు ఈటల రాజేందర్.

Related posts