telugu navyamedia
రాజకీయ వార్తలు

అమెరికాలో ఆగని నిరసనలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్

trump usa

అమెరికాలో నల్లజాతికి చెందిన జార్జ్ ఫ్లాయిడ్ ను పోలీసులు హత్య చేశారని ఆరోపిస్తూ హౌస్ వద్ద నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. అల్లర్లు అదుపులోకి రాకపోతుండడంతో భారీగా సాయుధ బలగాలను రంగంలోకి దించుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అల్లర్ల విషయంలో గవర్నర్లు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.

నేషనల్‌ గార్డ్స్‌ను రాష్ట్రాల్లోకి అనుమతించకపోతే సైన్యాన్ని రంగంలోకి దింపుతానని ట్రంప్ చెప్పారు.అమెరికాలో శాంతి, భద్రతలను కాపాడడం తన ప్రథమ కర్తవ్యమని తెలిపారు. కాగా, నిన్న రాష్ట్రాల గవర్నర్లతో ట్రంప్ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడి, నిరసనకు దిగిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. వారిని పదేళ్లపాటు జైల్లో పెట్టాలని హెచ్చరించారు. అలా చేస్తేనే ఇటువంటి ఘటనలు మరోసారి జరగవని చెప్పుకొచ్చారు.

Related posts