బంగ్లా క్రికెట్ బోర్డు క్రికెటర్ల దెబ్బకు దిగొచ్చింది. బోర్డు నుంచి క్రికెటర్లకు స్పష్టమైన హామీ లభించడంతో ఆటగాళ్లు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు బంగ్లా ఆటగాళ్లతో మాట్లాడిన బోర్డు అధ్యక్షుడు నజ్ముల్లా హసన్ క్రికెటర్ల డిమాండ్లలో తీర్చడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. క్రికెటర్లు కోరిన తొమ్మిది డిమాండ్లలో రెండు మినహా మిగతా వాటిని తీర్చడానికి సిద్ధంగా ఉన్నట్లు నజ్ముల్లా తెలిపారు.
సమ్మెకు కీలక పాత్ర పోషించిన షకిబుల్ హసన్‌కు డిమాండ్ల విషయంపై క్లారిటి ఇవ్వడంతో క్రికెటర్లు సమ్మెను విరమిస్తున్నట్లు తెలిపారు. దీంతో వచ్చే నెలలో భారత్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌తో పాటు, రెండు టెస్టుల సిరీస్‌కు అడ్డంకులు తొలగిపోయాయి.