telugu navyamedia
సినిమా వార్తలు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు గాయం..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో గురువారం దీపావళి పండుగను ఆనందంగా జరుపుకున్నారు. కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌తో కలిసి దిగిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీంతో తెగ వైర‌ల్ అయ్యింది. ట్రెడిషనల్ వేర్‌లో కొడుకులతో తారక్ క్యూట్ ఉన్నారంటూ ఫ్యాన్స్, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.  అయితే ఈ ఫొటోలో ఎన్టీఆర్ కుడిచేతికి బ్యాండేజీతో కనిపించారు.

బ్రేకింగ్:ఎన్టీఆర్ కుడి చేతికి సర్జరీ..

ఇటీవల తన ఇంటి జిమ్‌లో వ్యాయామాలు చేస్తుండగా ఆయన కుడిచేతి గాయమైనట్లు తెలుస్తోంది. వర్కౌట్స్ చేస్తుండగా కుడి చేతి వేలుకు గాయం కావడంతో నాలుగు రోజుల క్రితం వైద్యులు మైనర్ సర్జరీ చేశారని సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. కొద్దిరోజులు రెస్ట్ అవసరమని వైద్యులు తెలిపినట్లు సమాచారం.

మరో నెలరోజుల పాటు రెస్ట్ తీసుకోనున్న ఎన్టీఆర్ అనంతరం కొరటాల శివ షూటింగ్ ప్రారంభించనున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Related posts