telugu navyamedia
సినిమా వార్తలు

పునీత్‌ సమాధి వద్ద హీరో సూర్య భావోద్వేగం..

కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ గత శుక్రవారం(అక్టోబర్‌ 29)న గుండెపోటుతో అకాల మరణం చెందిన విష‌యం తెలిసిందే. ఉదయం జిమ్ చేస్తుండగా సడెన్ హార్ట్ స్ట్రోక్ రావడంతో పునీత్ మృతిచెందారు. పునీత్ మరణ వార్తను సినీ ఇండస్ట్రీ , అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు.  

దీంతో తెలుగు, మలయాళ, కన్నడ పరిశ్రమలకు చెందిన పలువురు హీరోలు ఆయ‌నకు నివాళులర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు పునీత్‌ సమాధిని హీరో సూర్య సందర్శించారు. పునీత్‌ సమాధి దగ్గర ఆయన ఫోటోకి పూలమాల వేసి నివాళులర్పిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. పునీత్‌ ఇక మన మధ్యలేరనే చేదు నిజాన్ని తలచుకుంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.

Suriya burst into tears as he recalls fond memories of late Puneeth Rajkumar | Tamil Movie News - Times of India

” పునీత్ లేడన్న విషయం నేను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నా.. రాజ్ కుమార్ ఫ్యామిలీకి, మా ఫ్యామిలీ ఒక గొప్ప స్నేహ బంధం ఉంది. పునీత్ వాళ్ళ అమ్మ, మా అమ్మ ఇద్దరూ గర్భవతులుగా ఉన్నప్పుడు కలిశారంట.. మేమిద్దరం కడుపులో ఉన్నప్పుడే ఒకరికొకరు పరిచయం చేసుకున్నాం” అంటూ భావోద్వేగానికి లోనైయ్యారు.

అనంతరం పునీత్ కుటుంబాన్ని పరామర్శించారు. పునీత్ అంత్యక్రియలకు రాలేని నటీనటులంతా ఆ త‌రువాత‌ స్వయంగా పునీత్‌ రాజ్‌కుమార్‌ ఇంటికి వచ్చి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు.ఇందుకు సంబంధించిన వీడియోను కాయల్‌ దేవ్‌రాజ్‌ అనే నటుడు ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు.

ఈ నేపథ్యంలో హీరో నాగార్జున్‌, మెగా హీరో రామ్‌ చరణ్‌, రాజేంద‌ర్ ప్ర‌సాద్‌లతో పాటు పలువురు నటులు బెంగళూరులోని ఆయన నివాసానికి వచ్చి పునీత్‌కు నివాళులు అర్పిస్తున్నారు.

Related posts