సూర్య ఈ పేరుకు తమిళ నాటే కాకుండా కూడా తెలుగు నాట కూడా భారీగా అభిమానులు ఉన్నారు. హీరో సూర్య ఇటీవల ఓ ప్రయేగాత్మక సినిమా ఆకావం నీ హద్దురాను చిత్రీకరించి ఓటీటీ బాట పట్టించాడు. అయితే ఈ సినిమా అబిమానుల అంచనాలను మించి ఆకాశానికి ఎగసింది. కొన్నాళ్లుగా సరైన హిట్ లేదనుకున్న సూర్యాకు ఈ సినిమా కెరీర్‌లోనే మర్చిపోలేని తీపి జ్ఞాపకంగా మారింది. దీంతో మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను మొదలు చేసేందుకు సన్నద్దమవుతున్నాడు. ఆకాశం నీ హద్దురా తరువాత సూర్యా ఏం చేస్తాడు. అతడి తరువాత సినిమా ఎలాంటి కథతో రానుంది. అని అభిమానులు అనుకున్నారు. అయితే సూర్యా మాత్రం ప్రయేగాలు చేసేందుకు సుముఖంగా ఉన్నాడు. ఇటీవల వచ్చిన సమాచారం ప్రకారం సూర్య మరో ప్రయోగాత్మక కథకు సంతకం చేశాడని, దానికి దర్శకుడు హరి డైరెక్షన్ చేయనున్నాడని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై దర్శకుడు హరి ఓ క్లారిటీ ఇచ్చాడు. శ్రీలంక నేపథ్యంలో ఓ సినిమా చేసేందుకు వీరిద్దరు ముందుకు వచ్చారని తెలుస్తోంది. అయితే ఈ ఐడియా సూర్య తెలపడంతో తాను ఓకే చెప్పాడన్నాడు. అయితే ఈ సినిమా కథ శ్రీలంక-తమిళ వర్గాల మధ్య తరతరాలుగా కొనసాగుతున్న వైరం గురించి తెలిసిందే. ఈ విషయ నేపథ్యంలో సినిమాను తీయాలని సూర్య ఆలోచించాడు. దీంతో తమిళ వర్గాలలో ఈ సినిమాపై ఆసక్తి రేకెత్తడం ఖాయం. అయితే ఈ సినిమా కేవలం ప్రజల ఆదరణనే కాకుండా అనేక వివాదాల్లో కూడా చిక్కునే అవకాశాలు బోలెడున్నాయి. మరి ఈ సినిమాను ఎలా తెరకెక్కస్తాడో చూడాలి.
previous post
next post