telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దీపికా పదుకొనె సంపాదన తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే…!!

deepika

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే దాదాపు 7 ఏళ్లుగా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఈ బ్యూటీ లేడీ ఓరియేంటేడ్ సినిమాలు చేస్తూ స్టార్ హీరోలకు పోటీ ఇస్తుంది. ఇక ఈ యేడాది నటించిన ‘ఛపాక్’ ప్రేక్షకులను అలరించిలేకపోయింది. మరోవైపు దీపికా తన భర్తతో పెళ్లి తర్వాత కలిసి నటించిన ‘83’ మూవీ త్వరలో విడుదల కానుంది. ఇక త్వరలో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం కాబోతుంది దీపికా. రెబల్ స్టార్ ప్రభాస్ తో నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సినిమాలో దీపికా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా కోసం కూడా దీపికాకు భారీగానే ముట్టజెప్పారని తెలుస్తుంది. ఇక దీపికా తీసుకునే రెమ్యునరేషన్ విషయానికొస్తే… ఆమె ఒక్కో సినిమాకు 15 కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకుంటుందట. ఈమద్య కాలంలో దీపిక తన పారితోషికంను 10 శాతం పెంచినట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరోవైపు ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ భారీ పారితోషికం అందుకుంటోంది. ‘సీఈవో వరల్డ్’ ప్రకారం దీపిక ఒక్కో సినిమాకు 1.82 మిలియన్ డాలర్స్ (దాదాపు రూ.14 కోట్లు) ఛార్జ్ చేస్తోందట. దీపిక మొత్తం సంపాదన 65 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.480 కోట్లు) అని సమాచారం. దీపిక తర్వాత అత్యంత సంపాదన ఆర్జించిన హీరోయిన్లుగా ప్రియాంకా చోప్రా, కరీనా కపూర్, అనుష్క శర్మ ఉన్నారు.

Related posts