telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సిగరెట్‌, పొగాకు వాసన అంటే ఇష్టమంటున్న శ్రుతిహాసన్‌

srutihasan

సీనియర్ స్టార్ హీరో కమల్‌హాస‌న్ కుమార్తె శ్రుతిహాస‌న్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి అన‌తి కాలంలోనే ఇటు ద‌క్షిణాదినే కాదు.. అటు బాలీవుడ్‌లోనూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగారు. అయితే ల‌వ్‌, బ్రేకప్ వంటి కార‌ణాల‌తో కొంత కాలం సినీ రంగానికి దూర‌మైన ఈ చెన్నై సొగ‌స‌రి మ‌ళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ప్ర‌స్తుతం ర‌వితేజ హీరోగా గోపీచంద్ మ‌లినేని తెర‌కెక్కిస్తోన్న ‘క్రాక్‌’ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది శ్రుతి. ఇప్పుడు ఈ అమ్మ‌డు క‌రోనా వ‌ల్ల క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో ముచ్చ‌టించారు. తన ఫోన్‌లో కాల్‌ రికార్డ్‌ యాప్‌ను ఎక్కువగా వాడుతానని ఈమెయిల్‌, మెస్సేజ్‌లు కాకుండా తాను ఎక్కువగా ఉపయోగించే యాప్ ఇదేనని శ్రుతిహాసన్‌ చెప్పింది. కరోనా నేపథ్యంలో షూటింగ్‌లకు విరామం రావడంతో ప్రస్తుతం తన ఇంటికే పరిమితమైన శ్రుతి సోషల్‌ మీడియాతో అభిమానులతో టచ్‌లో ఉంది. లాక్‌డౌన్‌లో తాను ఏం చేస్తున్నానో వారితో పంచుకుంది. తనకు సిగరెట్‌, పొగాకు వాసన అంటే ఇష్టమని చెప్పింది. అయితే, వాటిని కాల్చినప్పుడు వచ్చే వాసన మాత్రం నచ్చదు అని తెలిపింది. గులాబి, చాక్లెట్‌, పెన్సిల్, వెనిలా ఫ్లేవర్ వాసన అంటే కూడా ఇష్టమని చెప్పింది. చిన్నప్పుడు ఎరైజర్ సువాసనను ఎక్కువగా ఇష్టపడేదానిని శ్రుతి తెలిపింది.

Related posts