telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

యాంక‌ర్ ర‌వి హీరోగా ‘తోట‌బావి’ టీజర్

totabavi

యాంక‌ర్ ర‌వి హీరోగా గౌత‌మి హీరోయిన్‌గా గ‌ద్వాల్ కింగ్స్ స‌మ‌ర్ప‌ణ‌లో జోగులాంబ క్రియేష‌న్స్ ప‌తాకంపై అంజి దేవండ్ల ద‌ర్శ‌క‌త్వంలో ఆలూర్ ప్ర‌కాష్ గౌడ్ నిర్మిస్తోన్న చిత్రం ‘తోట‌బావి’ ఇటీవల విడుదలైన ఫ‌స్ట్ లుక్ పోస్టర్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్ర టీజర్‌ను దర్శకుడు ఎన్. శంకర్ విడుదల చేశారు. టీజర్ విడుదల అనంతరం ఎన్. శంకర్ మాట్లాడుతూ.. ‘‘టీజర్ చాలా బాగుంది. దర్శకుడు మంచి విజన్‌తో తెరకెక్కించాడు అని తెలుస్తోంది. నిర్మాణ విలువలు కూడా రిచ్‌గా ఉన్నాయి. రవిని చాలా కాలంగా టెలివిజన్‌లో చూస్తున్నాను. మంచి టైమింగ్ ఉన్న నటుడు. ఆయన హీరోగా చేస్తున్న చిత్రం ‘తోట‌బావి’. టైటిల్ చాలా కొత్త‌గా ఉంది. ఈ సినిమా ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు మంచి పేరు తీసుకు రావాల‌ని కోరుకుంటున్నా. టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ద‌ర్శ‌కుడు అంజి దేవండ్ల మాట్లాడుతూ.. ‘‘నా సినిమా టీజర్‌ను దర్శకుడు ఎన్. శంకర్‌గారు విడుదల చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. హీరో ర‌విగారు ఇచ్చిన స‌పోర్ట్‌తో సినిమా చాలా బాగా వచ్చింది. నిర్మాత‌లు ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సినిమాకు ఏం కావాలో అన్ని సమకూర్చి నాకు స‌హ‌క‌రించారు. తప్పకుండా మీ అందరికి నచ్చుతుందనే భావిస్తున్నాను’’ అన్నారు.

Related posts