కింగ్ నాగార్జున 59 ఏళ్ల వయస్సులో యంగ్ గా కన్పిస్తూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ఈ టాలీవుడ్ మన్మథుడు తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి మే 23 నాటికి 33 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నాగార్జున సతీమణి అమల అక్కినేని ఆయనకు అభిమానిగా ఓ ప్రేమ సందేశాన్ని లేఖ రూపంలో ఇచ్చారు.
“నటుడిగా ఎంతో ఎత్తుకు ఎదిగావు.. నా భర్త, నా హీరో, నా స్నేహితుడు నీ కాళ్లపై నువ్వు నిలబడ్డావు. ఇప్పటికీ నా గుండె నీ కళ్లలోని మెరుపు, స్టైల్ చూడటానికి తపిస్తుంది. స్క్రీన్‌పై నువ్వు కనపడితే చూపులు తిప్పుకోలేకపోతున్నాను. కాలం గడుస్తున్న కొద్దీ నువ్వు అందంగా తయారవుతున్నావు. సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో చెబుతూ మాకు ఎంగ్జాపుల్‌గా నిలుస్తున్నావు. నీ ప్రతి సినిమా సమయంలో ఎలా తెరపై కనిపిస్తావోనని ఆతృతగా ఎదురుచూస్తుంటా. అనేక కథలతో మెప్పించావు. వెంకటేశ్వరస్వామి, రాముడు, షిరిడి షాయికి నన్ను పరిచయం చేశావు. ఆ దేవుళ్లు ఇప్పుడు మన కుటుంబంలో భాగం అయ్యారు. ఓడిపోతావని నువ్వు ఎప్పుడూ భయపడలేదు. మంచి కంటెంట్ ఉన్న కథలను మాకు అందిస్తున్నావు. అలాగే కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటావు. అలాగే నీలో నిర్మాత కూడా ఓడిపోలేదు. 33 ఏళ్ల కెరీర్‌లో 95 సినిమాల్లో నటించావ్.. శుభాకాంక్షలు. మై స్వీట్ హార్ట్ అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగేశ్వరరావులా సినీ ఇండస్ట్రీలో నువ్వు ఇంకా ఎన్నో ఏళ్లు రాణించాలని కోరుకుంటున్నాను” అంటూ అమల నాగ్‌కు ప్రేమ లేఖ రాసి, తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.
సమంతా వల్లే అదంతా నేర్చుకున్నా..