telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ కు క్లాస్ట్రోఫోబియా అంటున్న రియా.. మరోసారి విరుచుకుపడుతున్న నెటిజన్లు

Sushanth

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య పై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం సీబీఐ అలాగే మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో ఈడీ రియాను విచారిస్తోంది. మాదకద్రవ్యాల దుర్వినియోగానికి సంబంధించి నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్ దృష్టి సారించింది. అయితే సుశాంత్ రద్దీగా ఉన్న చోటికి వెళ్లాలంటేనే భయపడేవాడని దీనిని క్లాస్ట్రోఫోబియా అని అంటారని రియా చెబుతోంది. గతంలో ఒకసారి తాము విదేశాలకు వెళ్లిన సమయంలో సుశాంత్ విమానంలో కూర్చోవడానికి చాలా భయపడ్డాడని, విమానం ఎక్కే ముందు అతను తన భయాన్ని తగ్గించుకోవడానికి మోడాఫినిల్ అనే టాబ్లెట్ ను తీసుకుంటానని చెప్పాడని తాను పేర్కొంది.అలా ప్రతిసారి భయం పోగొట్టుకోవడాని ట్యాబ్లేట్లు మింగేవాడని ఆమె చెప్పుకొచ్చింది. దాంతో నెటిజన్లు ఆమె పై మరోసారి ఫైర్ అవుతున్నారు. సుశాంత్ కు అంతభయముంటే నాసాకు వెళ్లాలని ఎందుకు అనుకుంటాడని ప్రశ్నిస్తూ… గతంలో సుశాంత్ విమానం నడిపిన వీడియో కూడా సోషల్ మీడియాలో ఉంది అంటూ గుర్తుచేస్తున్నారు. సుశాంత్ అలా భయపడితే.. విమానాన్ని ఎలా నడిపించాడు? విమాన లైసెన్స్ పొందటానికి ఎందుకు ప్రయత్నించాడు? అతను క్లాస్ట్రోఫోబిక్ అయితే ఇవన్నీ సాధ్యమేనా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

Related posts