telugu navyamedia
రాజకీయ వార్తలు

కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికపై ఆజాద్ కీలక వ్యాఖ్యలు

Gulam nabi azad

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నికపై పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరో ఒకరిని అధ్యక్షుడిగా నియమించడం కంటే ఎన్నికల ద్వారానే అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సూచించారు. అలా ఎన్నికైన వ్యక్తులను తొలగించడం సాధ్యం కాదన్నారు. నేరుగా నియమించే వ్యక్తికి ఒక్కశాతం మద్దతు కూడా ఉండకపోవచ్చని పేర్కొన్నారు.

ఎన్నికల ద్వారా అధ్యక్షుడిని ఎన్నుకోకుంటే పార్టీ మరో 5 దశాబ్దాలపాటు ప్రతిపక్షంలో కూర్చునేందుకు సిద్ధంగా ఉండాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవితోపాటు రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయి అధ్యక్షుల వరకు అన్ని కీలక పదవులను ఎన్నికల ద్వారానే భర్తీ చేయాలని ఆజాద్ సూచించారు. ఈ విధానాన్ని వ్యతిరేకించినవారు ఓటమికి భయపడుతున్నట్టే అని ఆయన అన్నారు.

Related posts