దివంగత నందమూరి తారకరామారావు జీవితచరిత్ర ఆధారంగా “ఎన్టీఆర్ బయోపిక్”ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగమైన “కథానాయకుడు” చిత్రాన్ని ఈరోజు విడుదల చేశారు. నిన్న ప్రీమియర్ షో చూసిన నందమూరి అభిమానులు సినిమా బాగుందంటూ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక ఎన్టీఆర్ కు, మోహన్ బాబుకు మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ ఆడియో వేడుకకు కూడా మోహన్ బాబును అతిథిగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈరోజు సినిమా విడుదలైన సందర్భంగా మోహన్ బాబు స్పందించారు.
“యన్.టీ.రామారావు గారు.. నాకు అన్నయ్య. ఏక గర్భమునందు జన్మించకపోయినా మేమిద్దరం అన్నదమ్ములు అని చెప్పిన మహానుభావుడు. ఆయన బయోపిక్ ని తెలుగులో తీయడమనేది మామూలు విషయం కాదు. అందులోనూ మహానటుడు కుమారుడు బాలయ్య అంటే తండ్రి చేసినటువంటి పాత్రలను తను పోషించడం అనేది కూడా మామూలు విషయం కాదు… బాలకృష్ణ ఒక మంచి దర్శకుడి చేతిలో పడి, ఆ సినిమా నిర్మించబడి, తను యాక్ట్ చేశాడంటే.. ఇదొక అద్భుతం, అమోఘం. ఆడియో ఫంక్షన్ కు నన్ను పిలిచారు.. నేను వెళ్ళాను కొన్ని క్లిప్పింగ్స్ చూస్తే మళ్ళీ అన్నయ్య పుట్టాడా అని అనిపించినట్టు కొన్ని కొన్ని సీన్స్ లో ఉన్నాయి” అంటూ ట్వీట్ చేశారు.