కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. కింగ్ ఖాన్ షారూక్ ఖాన్‌ను వెనక్కి నెట్టేశాడు. సోషల్ మీడియాలో సల్మాన్ ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య 4 కోట్లు దాటింది. దాంతో, ఇండియాలో 40 మిలియన్లు అంటే 4 కోట్లు ఫాలోవర్స్ కలిగిన రెండో సెలబ్రిటీగా నిలిచాడు. ప్రస్తుతం 41.49 మిలియన్ల ఫాలోవర్లతో బిగ్ బి అమితాబ్ బచ్చన్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. సల్మాన్ తర్వాత షారూక్ ఖాన్ 39.9 మిలియన్ల ఫాలోవర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. సల్మాన్ ప్రస్తుతం ‘కబీ ఈద్ కబీ దివాలి’, ‘బుల్బుల్ మ్యారేజ్ హాల్’, ‘రాధే’ చిత్రాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం సల్మాన్ లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌లకు బ్రేక్ పడడంతో ముంబైలోని తన ఫామ్‌హౌజ్‌లో ఉంటున్నాడు.
previous post
next post