telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

బానిసత్వం…

మోచేతి నీళ్ల మత్తులో పడి
బానిసత్వం అనే వేశ్యను మరిగి
ప్రశ్నించడం అనే పెళ్ళాన్ని ఏనాడో మరిచారు
ఎంగిలికూడుకు ఆశపడి
బానిసత్వానికి అలవాటు పడి
హక్కుల్ని, స్వేచ్ఛని పోగొట్టుకున్నారు
తలెత్తి అడిగితే తంతారన్న భయమో
ఎవడెటుపోతే మాకెందుకన్న నిర్లక్షమో
ఛేవలేని శరీరమో
మురికి నీరు పారె కంపు దేహమో ఏమో…!!
బతుకు మీద కొడుతున్నా,
బతుకులను తెల్లారుస్తున్నా
కుల,మతాలకి పుట్టిన కంపు శవాల్లా
చూస్తూ ఉంటారు తప్పా
నోరు విప్పి మాట్లాడారు ఎందుకో….!!
కులాల కంచెలు తెంచుకోరు
కాఖీల అన్యాయానికి ఎదురుతిరగరు
నాయకుల నక్కతెలివికి జై కొడతారు
నెత్తికెక్కి నోరు కొడుతున్నా
జీవితాలని కాలరాస్తున్నా
పాము పడగ నీడల్లో పక్షుల్లా
మిన్నులున్న పిడుగులకి చెట్టుల్లా
బలైపోతారే కానీ
బానిసల్లా నోరు తెరచి మాట్లాడరేమన్నా
బానిసత్వం అంటే మక్కువెందుకన్నా….!!
మేకల మందమీద మెకము పడ్డట్టు
బతుకులను దోచేస్తుంటే
వంగి వంగి దండాలు పెడతారు కానీ
నోరుతెరచి మాట్లాడరేమన్నా
బానిస బతుకును వదిలించుకోరేమన్నా….

Related posts