telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

100 మిలియన్ మార్క్ అందుకున్న ఎన్టీఆర్ టీజర్…

ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 80 శాతం పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు గా నటిస్తున్నారు. వీరిద్దరి వేర్వేరు ప్రాంతాలు.. వేరు వేరు కాలాలు. అయితే, ఈ సినిమాలో ఈ రెండు పాత్రలను ఎలా కలిపారు. ఎలా సినిమాను రన్ చేస్తున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకు సంబంధించి “రామరాజు ఫర్‌ భీమ్‌” టీజర్‌ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అక్టోబర్‌ 22న కొమురం భీం జయంతి సందర్భంగా విడుదలైంది ఈ టీజర్‌. ఈ టీజర్‌లో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌.. కొమురం భీంగా అదరగొట్టాడు. అయితే.. తాజాగా ఈ టీజర్‌ మరో రికార్డును క్రియేట్‌ చేసింది. ఇప్పటివరకు ఈ టీజర్ 100 మిలియన్ వ్యూస్ ‌తో ఆల్‌ టైం రికార్డును సృష్టించింది. ఐదు భారతీయ భాషల్లో కలిపి యూట్యూబ్ లో విడుదలైన ఈ టీజర్ 64.49 మిలియన్ వ్యూస్, ఫేస్ బుక్ లో 28.24 మిలియన్ వ్యూస్, ఇన్ స్టాగ్రామ్ లో 7.37 మిలియన్ వ్యూస్ దక్కాయి. దాంతో మొత్తంగా 100 మిలియన్ వ్యూస్ పూర్తి చేసుకుంది. అయితే ఈ టీజర్‌ పై వివాదం కూడా రాజుకున్న విషయం తెలిసిందే.. ఆదివాసులను కించ పరిచేలా ఉందని బీజేపీ ఈ టీజర్‌పై సంచలన ఆరోపణలు చేసింది.

Related posts