telugu navyamedia
సినిమా వార్తలు

బ్యాంక్ దోపిడీ కథ… నేరుగా బ్యాంకు పేరునే వాడుకున్నారు… అందుకే…!

Daaka

పంజాబీ స్టార్ గిప్పీ గ్రేవాల్ సినిమా ‘డాకా’ విడుదలకు ముందే చిక్కుల్లో పడింది. బ్యాంకు దోపిడీ కథాంశంతో రూపొందిన ఈ సినిమాపై పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టుకు పంజాబ్ గ్రామీణ బ్యాంకు నుంచి ఫిర్యాదు అందింది. ఈ సినిమా విడుదలను వెంటనే నిలిపివేయాలని ఫిర్యాదుదారులు కోరుతున్నారు. ఈ సినిమాలో పంజాబ్ గ్రామీణ బ్యాంకులో దోపిడీ జరిగే సీన్ చూపించనున్నారు. అయితే ఇందుకోసం బ్యాంకు నుంచి ఎటువంటి అనుమతి తీసుకోకుండా బ్యాంకు పేరును వాడారనే ఆరోపణలున్నాయి. అయితే ఈ ఫిర్యాదుపై స్పందించిన హైకోర్టు సినిమా నిలుపుదలకు అంగీకరించలేదు. అయితే ఈ సినిమాలో ఎక్కడెక్కడ బ్యాంకు పేరు కనిపిస్తున్నదో అక్కడ బ్లర్ చేయాలని సూచించింది. కాగా బ్యాంకు తరపున కోర్టులో ఫిర్యాదు చేసిన న్యాయవాది సునీల్ దీక్షిత్ మాట్లాడుతూ ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లపై కూడా పంజాబ్ గ్రామీణ బ్యాంకును పోలిన చిత్రాలు కనిపిస్తున్నాయన్నారు. చివరికి సినిమాలో సెక్యూరిటీ గార్డు ధరించే యూనిఫారం కూడా ఒరిజినల్ బ్యాంకు సెక్యూరిటీ గార్డు యూనిఫారంను పోలివుందన్నారు. ఈ విధంగా చేయడం వలన పంజాబ్ గ్రామీణ బ్యాంకుకు చెడ్డపేరు వస్తుందని ఆరోపిస్తున్నారు.

Related posts