telugu navyamedia
Uncategorized ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సామాన్య భక్తులకు తొలి ప్రాధాన్యం: వైవీ సుబ్బారెడ్డి

yv subbareddy

తిరుమల తిరుపతి దేవస్థానాల పాలక మండలి చైర్మన్‌గా వైసీపీసీ నియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. గరుడ ఆళ్వార్‌ సన్నిధిలో వైవీ సుబ్బారెడ్డితో ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీ తొలి ప్రాధాన్యత సామాన్య భక్తులేనని స్పష్టం చేశారు. తిరుమలలో తాగునీటి సమస్యను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరిస్తామని అన్నారు.

శ్రీవారి ఆభరణాల విషయంలో వచ్చిన ఆరోపణలన్నింటిపైనా విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు. అర్చకుల సమస్యలపై పీఠాధిపతులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, త్వరలోనే మఠాధిపతులు, పీఠాధిపతులతో సదస్సు నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమానికి ఎంపీ విజయసాయి రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు, చీఫ్‌విప్‌ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Related posts