telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర కేబినెట్ ఆమోదం…

స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలుపుతూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మార్చి 5న 5జీ స్పెక్ట్రమ్ వేలం వేయనుంది. వేలం ద్వారా 3 లక్షల 92 వేల 332 కోట్లు సమకూరుతాయని అంచనా వేస్తోంది కేంద్రం.  స్పెక్ట్ర‌మ్ వేలానికి సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌కు కేంద్ర క్యాబినెట్ తెలిపింది.  వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి చివ‌రి వారంలో స్పెక్ట్ర‌మ్ వేలం ఉంటుంద‌ని కేంద్ర మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ తెలిపారు. 20 ఏళ్ల కాల‌ప‌రిమితితో వేలం జ‌ర‌గ‌నున్న‌ది.    టెలికం శాఖ గుర్తించిన కొన్ని ఫ్రీక్వెన్సీల‌ను ఇప్ప‌టికే ర‌క్ష‌ణ మంత్రిత్వ‌, అంత‌రిక్ష శాఖ‌లు వినియోగిస్తున్నాయి.  మరోవైపు చెరకు రైతులకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర కేబినెట్. 60 లక్షల టన్నుల పంచదార ఎగుమతి చేసే వారికి టన్నుకు రూ.6000 చొప్పున సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాల్లో వేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్టు కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్ చెప్పారు. దీని వల్ల 5 కోట్ల మంది రైతులు, 5 లక్షల మంది సుగర్ ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులకు లాభం జరుగుతుందని అంచనా వేశారు. రైతులకు మూడు విడుతల్లో ఈ సబ్సిడీని ఇవ్వనున్నారు.

Related posts