telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

పట్ట పగలు నడిరోడ్డుపై ఇలా…

Austrelia

ఆస్ట్రేలియాలోని నడిరోడ్డుపై గొడవపడి ట్రాఫిక్ జామ్‌కు కారణమైన వారి ఆచూకీ గురించి వెతుకులాటలో పడ్డారు పోలీసులు. వివరాల్లోకి వెళ్తే… ఆస్ట్రేలియాలోని మిడిల్ స్వాన్ నగరంలో ఉన్న ఓ బిజీ హైవేపై ఆదివారం ఉదయం 11 గంటలకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఏంటా అని వాహనదారులు చూడగా.. ఓ ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటున్నారు. వీరిని ఆపడానికి అనేక మంది వెళ్లి ప్రయత్నించినప్పటికీ.. రోడ్డుపై పడి కూడా కొట్టుకుంటూనే ఉన్నారు. అలా చాలా సేపటి తరువాత ఒక పది మంది కలిసి వారిని వేరు చేయడంతో గొడవ సద్దుమణిగింది. ఈ ఘటనను అక్కడే కారులో ఉండి చూస్తున్న ఓ యువతి అక్కడి పరిస్థితిని ఫొటోలు తీసింది. హైవేపై పట్టపగలు రోడ్డుపై పడి మరీ కొట్టుకుంటున్నారంటూ ఆ యువతి ఆ ఫొటోలను తన ఫేస్‌బుక్‌లో పెట్టింది. ఈ ఫొటోలు అటూ ఇటూ షేర్లు అవుతూ.. ఆ ప్రాంత పోలీసుల కంట పడ్డాయి. అంతే.. వెంటనే స్పందించిన పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన వ్యక్తుల సమాచారం ఇవ్వాలని కోరారు. జరిగిన ఘటనను ఎవరైనా వీడియో రికార్డింగ్ చేసినట్టయితే తమకు అందించమంటూ సూచించారు.

Related posts