telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

సగ్గుబియ్యంతో ఎన్నో ఉపయోగాలు..

నిజానికి సగ్గుబియ్యాన్ని పరిశ్రమల్లో తయారు చేస్తారు. అధికంగా తమిళనాడు, కేరళ, ఏపీలలో ఉత్పత్తి చేస్తారు. తక్కువ కేలరీలతో ఎక్కువ శక్తినిచ్చే ఆహారం సగ్గుబియ్యం. ఇందులో కార్బొహైడ్రేట్లు అధికంగా ఉంటాయి.
ఆఫీస్‌ నుంచి ఇంటికి అలసటతో వస్తుంటారు. అలాంటప్పుడు సగ్గుబియ్యం వంటలు బాగా ఉపయోగపడతాయి. దీని వల్ల జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. తక్షణ ఎనర్జీ లభిస్తుంది.
పిండి పదార్థం ఎక్కువగా ఉండటం.. రసాయనాలు, తీపి పదార్థాలు లేకపోవడం వల్ల సగ్గుబియ్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. కాబట్టి, షుగర్‌ పేషంట్లు ఈ ఆహారాన్ని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.
తెల్ల సగ్గు బియ్యం గింజలతో వడలు, కిచిడీ, పాయసం లాంటి వంటలు చేసుకోవచ్చు.
సగ్గుబియ్యాన్ని నీటిలో ఉడికించి తీసుకుంటే జీర్ణక్రియ సమస్యలు రావు. పిల్లలకు పంచదార కలిపి ఇవ్వండి.
బలహీనంగా ఉన్నవారికి సగ్గుబియ్యం వస్తే.. బలహీనత తగ్గును.
పోషకాలు, విటమిన్లు, కాల్షియం, ఐరన్‌, పీచు పదార్థాలు సగ్గుబియ్యంలో ఉంటాయి.

Related posts