telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

బీర్ తాగితే ఉపయోగాలు ఉన్నాయా..?

ప్రస్తుతం కాలంలో మద్యపానం చేయని మగవాళ్లు ఉండరు. ప్రతి ఇంట్లో మందుబాబులు కచ్చితంగా ఉంటారు. అంతేకాదు.. హైదరాబాద్‌ లాంటి సిటీల్లో మహిళలు కూడా ఎగబడి తాగేస్తున్నారు. దీంతో రాష్ట్ర ఖజానాలు నిండిపోతున్నాయి. అయితే.. బీర్‌.. ఓ మద్యపానీయం. ఎలాంటి మద్యపానీయమైనా మన ఆరోగ్యానికి చేటు చేస్తుందనే విషయం తెలిసిందే. అయినా అప్పుడప్పుడు బీరు తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందని ఇటీవలే ఓ సర్వేలో తేలిందట. ఆస్ట్రియాలోని గ్రాజ్‌ యూనివర్సీటీకి చెందిన ప్రొఫెసర్లు ఈ విషయానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. కొందరు మగాళ్లలలో బీరు సేవించడం వలన సృజనాత్మకంగా ఆలోచించే సామర్థ్యం పెరుగుతోందని.. మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుందని ఓ సర్వే ఆధారంగా యూనివర్సీటీ పరిశోధకులు తెలిపారు. అదే ఆడవారికి సంబంధించి మెదడు సామర్థ్యమును, దాని చురుకుదానాన్ని విశ్లేషించే పరీక్షలు చేసినప్పుడు, మామూలు మహిళల కన్నా.. 350 ఎంఎల్‌ బీరు తాగిన ఆడవాళ్లలో ఆ శాతం 40 శాతం ఎక్కువగా ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.

Related posts