దేశంలోని కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. దీంతో అన్ని పార్టీలు ఈ ఎన్నికలపై దృష్టిసారించాయి. అయితే.. అందరి దృష్టి మాత్రం పశ్చిమబెంగాల్ పైనే ఉంది. ఎందుకంటే.. ఇటీవలే మమతా బెనర్జీపై దాడి జరిగింది. దీంతో అక్కడి ఎన్నికలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇది మరువకముందే మరో దారుణ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. డీఎంకే అధినేత స్టాలిన్ ఎన్నికల ప్రచారంలో పేలుడు కలకలం రేపింది. తాంబరం సమీపంలో నిన్న స్టాలిన్ ప్రచారం సమయంలో ఓ బిల్డింగ్ పైన పెద్ద ఎత్తున టపాసులు పేలాయి. దీంతో భవనం కింద ఉన్న పోలీసులకు తీవ్ర గాయలు అయ్యాయి. భారీ పేలుడు శబ్దం రావడంతో కార్యకర్తలు భయంతో పరుగులు తీశారు. ఈ తొక్కిసలాటలో మహిళా కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని తాంబరం ఆస్పత్రికి తరలించారు. ఇక అగ్నిమాపక సిబ్బంది మంటలను అర్పారు. ఇక తాము అధికారంలో వస్తే సంచలనం రేపిన గుట్కా కేసు విచారణ వేగవంత్ చేస్తామని, చెన్నై మాజీ కమిషనర్ జార్జ్, మాజీ డీజీపీ రాజేంద్రలపై చర్యలు తీసుకుంటామని ఈ సభలోనే ప్రకటించారు స్టాలిన్. అంతేకాదు తాంబరం ఎన్నికల సభలోనే మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసారు.
previous post