telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఎంత సమయమైనా కదలని కారు… ఆ కారులో ఉన్న దృశ్యంతో షాక్

car

అమెరికాలోని ఓహియో పట్టణంలోని ఓ రహదారి. రద్దీగా ఉన్న ఆ రోడ్డు పక్కన ఓ ఎర్ర చెవర్లెట్ కారు ఆగివుంది. తెల్లవారుజాము నుంచి ఆ కారు అక్కడే ఉండటం గమనించిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో ఉదయం 10.30కు ఆ ప్రాంతానికి చేరుకున్నారు పోలీసులు. ఆ కారులో ఏముందా అని చూసి షాకయ్యారు. ఎందుకంటే దానిలో ఓ మహిళ చలనం లేకుండా పడి ఉంది. వెంటనే బలవంతంగా కారు తలుపులు తెరిచి ఆమెను బయటకు తీసుకొచ్చారు. కానీ ఆమె అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ఆమె పేరు కిషా టోల్సన్ అని తెలిపారు. 29 ఏళ్ల కిషాను ఎవరైనా హత్య చేసి, కారులో అలా వదిలేసి ఉండొచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Related posts