telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నీ సినిమాలన్నీ కాపీలే… రాజమౌళికి యువదర్శకుడి లేఖ

rajamouli

రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల కాంబినేషన్‌లో ఆర్ ఆర్ ఆర్‌ను తెరకెక్కిస్తున్నసంగతి తెలిసిందే. ప్యాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాలో ఆలియా భట్, అజయ్ దేవగణ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. దీంతో ఇంటి వద్దనే ఉన్న రాజమౌళి ఇటీవల ఓ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు సమాదానంగా ఆస్కార్ అవార్డ్ ఫిల్మ్ పారాసైట్ తనకు బోర్ కొట్టిందని వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో ఓ యువ దర్శకుడు ఎలా అంటావు అంటూ తన సోషల్ మీడియా వేదికగా ఓ బహిరంగ లేఖ రాశాడు. నువ్వు సై సినిమాలో ప్రతీ సీన్ కాపీ కొట్టావు. మీరు తీసిన చాలా చిత్రాలు కూడా కాపీలే అంటూ తన లేఖలో పేర్కోన్నాడు. పారాసైట్ చిత్రం వాస్తవికతకి అద్దం పట్టేలా ఉంది. ప్రత్యేకించి భాషా అడ్డంకులను అధిగమించేంత శక్తివంతమైనదిగా నేను భావిస్తున్నాను. ఈ సినిమా బాలేదని రాజమౌళి అనడం ఏ మాత్రం బాగోలేదంటూ.. ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు పారాసైట్‌ని ఎంతగానో ప్రశింసించారు.. కానీ బాహుబలిని ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు మాట్లాడినట్లు తానెక్కడా వినలేదని.. చూడలేదని తన లేఖలో పేర్కొన్నాడు. ఈ యువ దర్శకుడి పేరు ప్రశాంత్ కుమార్. ఈయన 2019లో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ హీరోలుగా మిఠాయి అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ నేపథ్యంలో ప్రశాంత్‌ను టార్గెట్ చేసుకుని వివిధ రకాల మీమ్స్‌తో ట్విట్టర్‌లో రాజమౌళి అభిమానులు, నెటిజన్స్ తీవ్రంగా కామెంట్స్ పెడుతున్నారు. 

Related posts