నేషనల్ ఇనిస్ట్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ (ఆయూష్) అంతర్జాతీయ స్థాయి లో అవినీతిపై పోరాటానికి పోస్టర్స్, వీడియో పోటీల్లో యువతీ యువకులు పాల్గొనడానికి అవకాశం కల్పించనున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్రీయ నిఘా వ్యవహారాల కమిషన్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవినీతిపై కలిసికట్టుగా పోరాడడానికి యువతి, యువకులకు అంతర్జాతీయ స్థాయి పోస్టర్, వీడియో పోటీ డిపార్టుమెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ ద్వారా పోటీలను నిర్వహిస్తున్నారు.
ఈ నెల 30 వరకు కొనసాగే పోటీల్లో పాల్గొనే వారు 14 నుంచి 35 ఏండ్లు మించరాదని, అవినీతిపై రూపొందించిన వాటిని ఆన్‌లైన్‌లో పోస్టర్, వీడియో కానీ చిత్రీకరించిన వాటిని నెలాఖరు వరకు https:// anticorruption.life/en/కు పంపించాలని తెలిపారు. ఈ పోటీల్లో విజయం సాధించిన ముగ్గురు విజేతలకు జాతీయస్థాయిలో అవార్డ్స్ డిసెంబర్ 9న అందజేస్తారని తెలిపారు. వివరాలకు 040-24067388 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.