telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పోకిరి సినిమాని అలా మిస్ చేసుకున్నా : కంగనా రౌనత్

kangana

సూపర్ స్టార్ మహేష్ బాబు, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలయికలో వచ్చిన చిత్రం ‘పోకిరి’. సరిగ్గా 14 ఏళ్ల క్రితం 2006 ఏప్రిల్ 28న ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ఇలియానా హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం అప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇలియానానకు కాకుండా కంగానాను అనుకున్నారట. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో కంగనా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఆమె గ్యాంగ్‌స్టర్స్ సినిమా ఆడియన్స్‌కు వెళ్లిన సమయంలో.. పూరీ జగన్నాథ్ ముంబాయిలో పోకిరి సినిమా ఆడిషన్స్ జరగుతున్నాయి ఆ సమయంలో కంగనా రెండింటికి అటెండ్ అయిందట. ఒకేసారి రెండు సినిమాల్లో ఆమె సెలెక్ట్ అయిందనే విషయాన్ని చెప్పింది. అయితే ముందుగా డేట్లు ‘గ్యాంగ్ స్టర్‌’ సినిమాకు ఇచ్చేయడంతో పోకిరి సినిమా చేయలేకపోయిన విషయాన్ని ఈ సందర్భంగా కంగాన ప్రస్తావించింది. లేకపోతే.. టాలీవుడ్‌లో నేను పెద్ద హీరోయిన్ అయ్యేదాన్నుంటూ కంగనా తెలిపింది. పోకిరి సినిమాలో నటించపోయినా కంగాన ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘ఏక్ నిరంజన్’ సినిమాలో యాక్ట్ చేసింది.

Related posts