ప్రముఖ తెలుగు సినీ నటుడు మోహన్ బాబును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల సమస్యలపై ఆయన శుక్రవారం ర్యాలీని తలపెట్టారు. దీంతో ముందస్తుగా ఆయనను హౌస్ అరెస్టు చేశారు. ఫీజు రీయంబర్స్ మెంట్ ను ప్రభుత్వం విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం శ్రీవిద్యా నికేతన్ నుంచి తిరుపతి వరకు వేలాది మంది విద్యార్థులతో మోహన్ బాబు నిరసన ర్యాలీ చేపట్టనున్నారు.
మోహన్ బాబు నిర్వహించే ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తాను ర్యాలీని చేపట్టి తీరుతానని మోహన్ వెల్లడించారు. దీంతో ఆయనను పోలీసులు హౌస్ అరెస్టు చేసి, ఆయన ఇంటిని చుట్టుముట్టారు. ఫీజు రియంబర్స్ మెంట్ ను విడుదల చేయకపోవడంపై గతంలో మోహన్ బాబు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.