telugu navyamedia
సామాజిక

చూడ్డానికే కండోమ్ ప్యాకెట్లు… తెరిచి చూస్తే…

Sex-and-Psychology
స్మగ్లర్లు డ్రగ్స్ ను వివిధ పద్ధతుల్లో అనేక రకాలుగా ఒక దేశం నుంచి మరో దేశానికి తరలించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పెరు దేశానికి చెందిన ఓ స్మగ్లర్ పెరు నుంచి ఈజిప్టుకు కొకైన్ ను కండోమ్ ప్యాకెట్లలో తరలించడానికి యత్నిస్తూ దుబాయ్ పోలీసులకు దొరికిపోయాడు. దుబాయ్ ఎయిర్ పోర్టులో స్మగ్లర్ బ్యాగును కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.
అతను తీరు అనుమానాస్పదంగా ఉండడంతో అధికారులు ఆ కండోమ్ ప్యాకెట్లను ల్యాబ్ కు పంపగా… అందులో 2.3 కేజీల కొకైన్ ఉన్నట్లు గుర్తించారు. స్మగ్లర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఏప్రిల్ 23న కోర్టులో హాజరుపరచనున్నారు. ఇటీవలే ఓ స్మగ్లర్ వేరుశెనగ గింజలలో కొకైన్ ను తరలిస్తూ అధికారులకు షాకిచ్చాడు. ఇంకా ఆ ఘటనను మరవక ముందే ఇప్పుడు మరో సంఘటన వెలుగు చూసింది. 

Related posts