telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కరోనాపై ట్రంప్ తప్పుడు పోస్టు.. తొలగించిన ఫేస్‌బుక్‌

trump usa

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో తప్పుడు వార్తలను పోస్టు చేస్తున్న వారిపై ఫేస్‌బుక్‌ చర్యలు తీసుకుంటోంది. అటువంటి సమాచారం తమ దృష్టికి వస్తే వాటిని సైట్‌ నుంచి తొలగిస్తోంది. చివరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఓ పోస్ట్‌ను కూడా ఫేస్‌బుక్‌ తొలగించింది.

ట్రంప్‌ ఫేస్‌బుక్‌ లో ఓ వీడియోను పోస్ట్ చేస్తూ.. కొవిడ్‌-19ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి చిన్నారుల్లో ఉంటుందని చెప్పారు. అయితే, తమ సంస్థ నిబంధనలను ఉల్లంఘిస్తూ, కరోనా వైరస్‌పై డొనాల్డ్ ట్రంప్ తప్పుడు సమాచారాన్ని షేర్ చేశారని ఫేస్‌బుక్‌ పేర్కొంది.

ట్రంప్ పోస్టు పై ఫేస్‌బుక్ సంస్థ వివరణ ఇచ్చింది. క‌రోనా వైర‌స్ ప‌ట్ల జరుగుతోన్న త‌ప్పుడు ప్ర‌చారమని ఫేస్‌బుక్‌ తెలిపింది. ఇది తమ పాలసీలను ఉల్లంఘించడమే అవుతుందని తెలిపింది. కొవిడ్‌-19 గురించి ఇచ్చిన ఈ సమాచారం హానికరమని ఫేస్‌బుక్ వివరణ తెలిపింది. ఇందుకే ఈ పోస్టును తొలగించామని ఫేస్‌బుక్ స్పష్టం చేసింది.

Related posts