telugu navyamedia
క్రీడలు వార్తలు

టాస్ ఓడిపోవడంలో కూడా కోహ్లీ రికార్డ్…

టాస్‌ ఓడిపోవడంలో తనదైన ముద్రను వేసుకున్నాడు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ముచ్చటగా మూడోసారి టాస్‌ కోల్పోయిన టీమిండియా కెప్టెన్‌.. ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు అంగీకరించాడు. ఇంగ్లండ్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 12 సార్లు టాస్‌ వేయగా.. టీమిండియా కెప్టెన్ కేవలం రెండు సార్లు మాత్రమే టాస్ నెగ్గాడు. మిగిలిన 10 సందర్భాల్లో టాస్‌ ఓడిపోయాడు. చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టులో‌, అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన రెండో టీ20లో అలాగే రెండో టెస్టులో మాత్రమే కోహ్లీ టాస్ నెగ్గాడు. దీంతో కోహ్లీపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అయితే టాస్‌లు గెలవకపోయినా మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌లు కైవసం చేసుకోవడమే ముఖ్యమని కొందరు నెటిజన్లు అభిప్రాయాపడుతున్నారు.

Related posts