telugu navyamedia
క్రీడలు వార్తలు

వన్డే అవార్డుల పై కోహ్లీ అసహనం…

birthday wishes to virat kohli

సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో ఆదివారం జరిగిన మూడో వన్డేలో భారత్‌ 7 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌ భారత్‌కు చుక్కలు చూపించాడు. ఇంగ్లండ్‌కు విజయం అందించడానికి కడవరకు పోరాడాడు. ఓ దశలో కరన్‌ దెబ్బకు భారత్ ఓడిపోతుందనుకున్నారు. అయితే చివరి ఓవర్‌ను టీ నటరాజన్‌ అద్భుతంగా వేయడంతో భారత్ ఊపిరిపీల్చుకుంది. కరన్‌ పోరాట పటిమగానూ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు. మ్యాచ్‌ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ… ‘భువనేశ్వర్ కుమార్, శార్దూల్‌ ఠాకూర్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. మిడిల్‌ ఓవర్స్‌లో బౌలర్లు వికెట్లు తీయడం చాలా కష్టంతో కూడుకున్న పని. కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్’‌గా శార్దూల్‌ ఠాకూర్‌ను ఎంపిక చేస్తారని అనుకున్నా. కానీ అందుకు భిన్నంగా సామ్‌ కరన్‌ ఎంపిక విస్మయానికి గురిచేసింది. ఇక ప్లేయర్‌ ‘ఆఫ్‌ ది సిరీస్’కు‌ భువనేశ్వర్‌ అర్హుడు’ అని అన్నాడు. ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’‌గా జానీ బెయిర్‌స్టో నిలిచాడు. సిరీస్ సాంతం పొదుపుగా బౌలింగ్ చేసిన భువనేశ్వర్ కుమార్.. 6 వికెట్లు పడగొట్టాడు. ఇక ఠాకూర్ 7 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. అందుకే వీరికి అవార్డు ఇవ్వకపోవడంపై కోహ్లీ పెదవి విరిచాడు.

Related posts