telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

కరోనా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం…ఎనిమిది మంది మృతి

corona hospital fire

అహ్మదాబాద్ లోని కరోనా ఆసుపత్రిలో ఈ తెల్లవారుజామున సంభవించిన అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది సజీవదహనం అయ్యారు. నవ్ రంగ్ పుర ప్రాంతంలోని షెర్రే హాస్పిటల్ లో ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్నఫైర్ ఇంజన్లు, అంబులెన్స్ లు ఘటనా స్థలికి చేరుకున్నాయి. ఆసుపత్రిలోని ఐసీయూ వార్డులోనే అత్యధిక నష్టం సంభవించింది. ఇక్కడ చికిత్స పొందుతున్న ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలు మృత్యువాత పడ్డారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

మొత్తం 50 పడకల సామర్థ్యమున్న ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో 45 మంది రోగులున్నారు. మృతులు మినహా మిగతా అందరినీ సురక్షితంగా కాపాడి, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబీకులకు ట్విటర్ లో సానుభూతి తెలిపారు. బాధితులకు అన్ని విధాలుగా సాయపడతామని హామీ ఇచ్చారు. తక్షణ సాయంగా మృతులకు రూ.2 లక్షల చొప్పున పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మంజూరు చేస్తున్నామని తెలిపారు. గాయపడిన వారికి, రూ. 50 వేలు ఇస్తామని పేర్కొన్నారు.

Related posts