telugu navyamedia
క్రీడలు వార్తలు సామాజిక

అంతర్జాతీయ క్రికెట్‌కు యువరాజ్‌ గుడ్‌బై

IPL Auction IPL 2019 Cricketer Youvaraj

టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ యువరాజ్‌సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. ఈరోజు ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా సమావేశంలో యూవీ మాట్లాడుతూ క్రికెట్ తనకు పోరాడటం, పడటం, లేవటం, ముందుకు సాగడం నేర్పిందని చెప్పారు. ఇకపై కేన్సర్ బాధితులకు అండగా ఉండటమే తన తదుపరి లక్ష్యమని అన్నారు. తన జీవితంలో తనపై తాను ఎప్పుడూ విశ్వాసం కోల్పోలేదని అన్నారు.

2011 వరల్డ్ కప్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ధోనీసేన కప్ గెలవడంలో యువీ అసాధారణ పాత్ర పోషించాడు. 2007 టీ20 ప్రపంచకప్ విజయంలోనూ అతడు అదరగొట్టాడు. భారత్ తరఫున యువీ 40 టెస్టులు, 304 వన్డేలు, 58 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. 37ఏండ్ల యువీ 2000 సంవ‌త్స‌రంలో భార‌త త‌ర‌ఫున అంత‌ర్జాతీయ‌ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. కొద్దిరోజుల క్రితం ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో యువరాజ్ సింగ్ ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు.

Related posts