డీఎంకే కు చంద్రబాబు నాయుడు ఎందుకు మద్ధతు ఇస్తున్నారో? దానికి సంబంధించి ప్రజల అనుమానం నివృత్తి చెసేందుకైనా సమాధానం చెప్పాలని బిజేపి నాయకుడు జివీఎల్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డీఎంకే అధ్యక్షులు ఎంకే స్టాలిన్ చెప్పారా? అని సూటిగా ప్రశ్నించారు. కర్ణాటకకు పోయి ప్రచారం చేస్తున్నావ్? ప్రత్యేక హోదాకు అక్కడి సీఎం కుమారస్వామి ఏమైనా మద్ధతిచ్చారా? అంటూ జీవీఎల్ సూటిగా నిగ్గదీశారు.
పనిగట్టుకొని కర్నాటక మాంద్య నియోజకవర్గంలో మన తెలుగింటి ఆడపడుచు, ప్రఖ్యాత బహుభాషా హీరోయిన్, దివంగత అంబరీష్ సతీమణి సుమలత కు వ్యతిరేఖంగా కుమార స్వామి కొడుకు నిఖిల్ గౌడకు అనుకూలంగా బాబు ప్రచారం చేయటం నగుబాటు కాదా! సుమలతకు వ్యతిరేఖంగా ప్రచారం చేయటం కూడా తెలుగు ప్రజలకు చంద్రబాబు పట్ల ద్వేషభావం నానాటికి పెంచుతుంది. ఏపీ అభివృద్ధిని కోసమే మోడీ వ్యతిరేఖపక్షాలకు అనుకూల ప్రచారం అంటున్న చంద్రబాబు నిజంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకునే ఏపి వైరి పార్టీ లతో జతకడుతున్నారని ప్రజలు భావిస్తున్నారు.
విసుగెత్తిన తెలుగు జనం, ఆల్మట్టి డాం పేరుతో తెలుగువారి నోట్ల మట్టి గొట్టిన దేవేగౌడ కు మద్దతేంది చంద్రబాబూ? అంటున్నారు . తెలంగాణ సిఎం కేసీఆర్, ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని మద్ధతు తెలిపిన తరవాత కూడా ఆయనను విమర్శించడం బాబు మానలేదని అంటున్నారు. అసలు చంద్రబాబు ఉద్దేశమేమిటి? అంటూ ఓటమి భయంతోనే ఈసీ, ఈవీఎం, మోదీ పైన చంద్రబాబు అసలేమాత్రం సంబంధంలేని విమర్శలు చేస్తున్నారని బిజెపి ఎమ్.పి. జివిఎల్ నరసింహారావు విమర్శించారు.
చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అనేక అరాచాకాలకు పాల్పడుతున్నారని, అందువల్ల ఎపిలో ప్రభుత్వ పాలన పూర్తిగా స్పందించిందని ప్రస్తుతమున్న ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన పెట్టటం చాలా అవసరమని సి. రామచంద్రయ్య అన్నారు. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ చంద్రబాబు పలు నిర్ణయాలు చేస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు బరితెగించి ప్రజాస్వామ్యానికి పూర్తిగా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్నికల్లో ఓడిపోతే చేసిన అవినీతి వ్యవహారాలు బయటపడతాయని చంద్రబాబు భయపడుతున్నారని, అందుకే సుప్రీంకోర్టుకు కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.
మీడియా ముందుకు ఎమ్మెల్యే ఆర్కే: టీడీపీపై ఆగ్రహం