ప్రపంచంలోనే హైదరాబాద్ నగరం అత్యంత సురక్షితమైన సిటీ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నగరంలోని హెచ్‌ఐసీసీలో జరిగిన “బ్రాండ్ హైదరాబాద్ ఫ్యూచర్ రెడీ” సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ పార్టీ ఆరేళ్లలో హైదరాబాద్‌ను ఏవిధంగా అభివృద్ధి చేసిందో మంత్రి కేటీఆర్ తెలిపారు. ఒక్క రోజులో, ఒక్క ప్రభుత్వంతో హైదరాబాద్ కు బ్రాండ్ ఇమేజ్ రాలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడుతూ అభివృద్ధిని కొనసాగిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో స్థిరమైన ప్రభుత్వం ఉందని.. అందుకే పెట్టుబడులు వస్తున్నాయని వెల్లడించారు. ఐటీ రంగంలో బెంగుళూరు కంటే ఎక్కడ వెనుబడ్డామో పరిశీలించుకుంటున్నామని తెలిపారు. గత ఐదేళ్లలో ఐటీ పెట్టుబడులు రెట్టింపయ్యాయన్నారు. 2014 కు ముందు హైదరాబాద్‌లో అనేక సమస్యలు ఉండేవని… సీఎం కేసీఆర్ వాటిని ప్రత్యేక దృష్టితో వాటిని పర్కిష్కరిస్తున్నారని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఐదు ఐటీ కంపెనీలు హైదరాబాద్‌ను తమ రెండో చిరునామగా ప్రకటించాయని చెప్పారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.
previous post