telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైఎస్ వివేకాతో జగన్ కు రాజకీయ వైరం: చంద్రబాబు

వైఎస్ వివేకానందతో వైకాపా అధ్యక్షుడు జగన్ కు రాజకీయ వైరం ఉందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు. వివేకా ఎంపీగా ఉన్న సమయంలో రాజీనామా చేయాలని జగన్ బెదిరింపులకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. ఈ రోజు ఉదయం పార్టీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. చిన్నాన్న హత్యనే గుండె నొప్పిగా చెప్పి పక్కదారి పట్టించిన ఘనుడు వైస్ జగనని బాబు వ్యాఖ్యానించారు. సిట్ విచారణలో అన్ని విషయాలూ బయటకు వస్తాయని, ఈ కేసులో దోషులను వదిలిపెట్టబోనని హెచ్చరించారు.

వివేకా మరణం తరువాత జగన్ కుతంత్రాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. తాను ఎక్కడికి వెళ్లినా టీడీపీ పట్ల అపూర్వ ఆదరణ కనిపిస్తోందని, రైతులు, మహిళలు, యువత తోడ్పాటుతో ఎన్నికలు ఏకపక్షంగా సాగనున్నాయని అన్నారు. లబ్దిదారులంతా టీడీపీ వైపే ఉన్నారని అన్నారు. ఎన్నికల్లో టీడీపీకి ఊహించనంత మెజారిటీ వస్తుందనడంలో సందేహం లేదని చెప్పారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి ఆగిపోతుందని.. దౌర్జన్యాలు పెరిగిపోతాయని హెచ్చరించారు. ఆంధ్రా వ్యతిరేకులతో అంటకాగుతున్న పార్టీలకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

Related posts