telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

డబ్ల్యూహెచ్ఓను బెదిరించిన చైనా.. ‘న్యూస్‌వీక్’ కథనం!

who modi

కరోనా వ్యాప్తిపై సకాలంలో స్పందించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కు నిధులు నిలిపివేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చైనా కూడా డబ్ల్యూహెచ్ఓ ను బెదిరించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) ఈ విషయాన్ని బయటపెట్టింది. జనవరిలో చైనాలో కరోనా కేసులు పెరుగుతున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని డబ్ల్యూహెచ్ఓ భావించింది.

హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటిస్తే తమ సహకారాన్ని ఆపేస్తామని డబ్ల్యూహెచ్ఓను చైనా బెదిరించినట్టు సీఐఏ తాజా నివేదికను న్యూస్‌వీక్ తన కథనంలో పేర్కొంది. దీంతో వైరస్ విషయంలో తాము స్వతంత్రంగానే వ్యవహరించినట్టు డబ్ల్యూహెచ్ఓ పేర్కొన్నట్టు న్యూస్‌వీక్ రాసింది. 

Related posts