ఈ నెలలో బ్యాంకు ఖాతాదారులు, లావాదేవీలు నిర్వహించుకునేవారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సంవత్సరంలోనే అత్యధికంగా 11 సెలవులు ఒక్క ఈ నెలలో ఉన్నాయి. మార్చి 31న ఆర్థిక సంవత్సరం చివరి రోజు పని చేయడంతో ఏప్రిల్ 1న బ్యాంకులకు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. మిగిలిన మరో 29 రోజుల్లో 10 రోజులు బ్యాంకులు ఉండవు.
అదెలాగంటే; 6న ఉగాది, 7న ఆదివారం, 11న పోలింగ్, 13న రెండో శనివారం, 14న ఆదివారం, 17న మహావీర్ జయంతి, 19న గుడ్ ఫ్రైడే, 21న ఆదివారం, 27న నాల్గవ శనివారం, 28న ఆదివారం… ఈ పది రోజులూ బ్యాంకులు పని చేయవు కాబట్టి, ఖాతాదారులు ముందు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
మాకు ప్రతిపక్షం..స్వపక్షం ఏమీ ఉండవు..మాకు అంతా సమానమే..