telugu navyamedia
రాజకీయ వార్తలు

కరోనాను కట్టడి చేయడంలో ట్రంప్ విఫలం: ఒబామా విమర్శలు

obama usa

కరోనా వైరస్‌ను నియంత్రించడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విఫలమయ్యారని ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఒబామా విమర్శలు గుప్పించారు. కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ట్రంప్ తీరు బాగోలేదని ఆయన అన్నారు. ఆయన ఒకరితో చేసిన సంభాషణ బయటకు వచ్చింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కొన్ని నెలలే గడువు ఉన్న నేపథ్యంలో బయటకు వచ్చిన ఈ సంభాషణ ఆసక్తికరంగా మారింది. కరోనాను ట్రంప్‌ ఎదుర్కొంటున్న తీరు గందరగోళంగా ఉందని ఒబామా చెప్పారు.

ప్రస్తుతం అమెరికావాసుల జీవితాల్లో స్వార్థం, ద్వేషం వంటి పోకడలు భాగమయ్యాయయని ఆయన అన్నారు. అమెరికాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఇదేతీరు కొనసాగుతోందని ఆయన తెలిపారు. ఈ పరిణామాల వల్లే తాజా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రపంచ దేశాలు చాలా అసమర్థంగా స్పందిస్తున్నాయని చెప్పారు. కరోనా వంటి విపత్కర పరిస్థితులని ఎదుర్కోవడం ప్రభుత్వాలకు సవాలుతో కూడుకున్న విషయమని చెప్పారు.

Related posts