ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయ పరిణామాలపై సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, మధు స్పందించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ సొంత ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారని విమర్శించారు. రాజధాని విషయంలో జగన్ మొండిగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. రాజధాని అంశంపై ఏపీ హైకోర్టు స్టే విధించడం హర్షించదగ్గ విషయమని అన్నారు.
అమరావతినే రాజధానిగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధానిని మారుస్తారా? అని ప్రశ్నించారు. అమరావతి రైతులకు వామపక్షాల మద్దతు ఉంటుందని చెప్పారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న రైతులపై పోలీసులతో ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు.
ఇళ్ల స్థలాల పేరుతో ఇన్సైడర్ ట్రేడింగ్: కళా వెంకట్రావు