telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

జ్ఞాపకం..

శిధిలమైన గుడి పైకప్పు లాంటి
ముడతలు తేలిన చర్మంతో
మసకబారిన చూపులతో
తెరచిన పుస్తకంలో
” యవ్వనాన్ని ఏరుకుంటోంది “
నిన్న కన్న కళలు కల్లలైపోతే
నేటి రెక్కలు విరిగి పోతే
ప్రేమ పంచుకున్న వాడు నేలరాలి పోతే
పేగు తెంచుకు పుట్టినవాడు వదిలేసి పోతే
ప్రాణమంటే ఆశ సడలిన
ఈ కాలం నుండి తనని ప్రాణంగా భావించిన నాటి కాలానికి పరుగులు పెడుతోంది
కదలలేని తన వృద్ధాప్యాన్ని
రెక్కలొచ్చాక వదిలేసిన తన బిడ్డల్ని
ఒంటిరి తనాన్ని వదిలేసి
గడిచిన తియ్యని కాలంలో
మధురమైన స్మృతులన్నింటిని
పుస్తకంలో తవ్వుతోంది
అలసిన కనులకి
సొలసిన దేహానికి
ప్రశాంతతని కమ్మని నిద్రని
వెతుక్కుంటోందో
నేటి చీకటిని తుడిచి
మనుగడలో మీగడనే తలచి
ఇంకిపోయిన నెత్తురులోకి
కొత్త శక్తినిచ్చే ఆ జ్ఞాపకాలని
అక్షరాల సాయంతో మెలమెల్లగా వెలికితీస్తోంది…

Related posts