ఉల్లి ధరల చుక్కలనంటుతుండటంతో ప్రజలు వాటిని కొనుగోలు చేసేందుకు రైతు బజార్ల వద్ద బారులు తీరుతున్నారు. తగ్గింపు ధరపై ఏపీ ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఉల్లి కోసం విశాఖ ఏంవీపీ రైతు బజార్లో తోపులాట చోటుచేసుకుంది. ఈ రోజు తెల్లవారు జాము నుంచే ఉల్లి కొనుగోలు కోసం విక్రయ కేంద్రం వద్ద భారీ సంఖ్యలో ప్రజలు క్యూ కట్టారు. అధికారులు డిమాండ్ కు సరిపడా ఉల్లిని అందుబాటులో ఉంచకపోవడంతో ప్రజలు అక్కడి అధికారులతో వాగ్వాదానికి దిగారు.
అధికారులు 2,100 కిలోల ఉల్లిని మాత్రమే సరఫరా చేశారు. ఇవి భారీ సంఖ్యలో వచ్చిన వినియోగ దారులకు ఏ మూలకు సరిపోలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని క్యూలైన్లను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో తోపులాట జరిగింది. కొందరు స్పృహ తప్పి పడిపోయారు. చాలామందికి ఉల్లిపాయలు దొరకక వెనుదిరిగారు.
జగన్ గారూ మీరు ఏపీకి సీఎం.. సాక్షి పేపర్ చదవడం మానేయండి?: నారా లోకేశ్