telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“జనతా కర్ఫ్యూ”పై పవన్ వీడియో వైరల్

pawan

దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోవడంతో ప్రజల్లో తీవ్రభయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో గురువారం (మార్చి-19,2020) భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ జాతినుద్దేశించి మాట్లాడిన సంగతి తెలిసిందే. ఆదివారం (మార్చి-22) న జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు మోడీ. తాజాగా జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ కరోనా వైరస్ పట్ల ప్రధాని చేసిన సూచనలను స్వాగతిస్తున్నట్లు తెలుపుతూ ఓ వీడియో విడుదల చేశారు. ‘‘మోడీ చేసిన సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.. ఈ నెల 22వ తేది ఆదివారం మోడీ చెప్పినట్టు జనతా కర్ఫ్యూని పాటిద్దాం.. ఆరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇళ్లకే పరిమితమవుదాం.. కరోనా మహమ్మారిని నిర్మూలించడానికి క్షేత్రస్థాయిలో పని చేస్తున్నటువంటి డాక్టర్స్, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, వైద్య ఆరోగ్య సిబ్బంది, మీడియా, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు.. ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాయి. జనతా కర్ఫ్యూ రోజు ప్రతి ఒక్కరు ఇళ్ల బాల్కనీలోకి వచ్చి తమ కరతాళ ధ్వనులతో కానీ, ఏదైనా నాదం ద్వారా కానీ సంఘీబావం తెలుపుదాం.. సామాజిక సంఘీభావ కార్యక్రమంలో మన అందరూ మమేక మవడం విధిగా భావిద్దాం. మోడీ గారి పిలుపునకు దేశమంతా స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుగు చిత్ర పరిశ్రమ కూడా 24 క్రాఫ్ట్‌కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో విధిగా పాల్గొనాలి అని ఆర్ధిస్తున్నాను. ప్రధాని మాట పాటిద్దాం కరోనా విముక్త భారతాన్ని  సాదిద్ధాం’’ అంటూ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

Related posts