telugu navyamedia
సినిమా వార్తలు

బిగ్ బాస్-5 గ్రాండ్ ఫినాలే…స‌ర్వం సిద్ధం..

తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో అల‌రిస్తున్న వ‌ర‌ల్డ్ బిగ్‌స్ట్ షో బిగ్​బాస్​ సీజన్-5 నేటితో చివ‌రి ఘ‌ట్టానికి చేరుకుంది. టాలీవుడ్ టాప్ హీరో అక్కినేని నాగార్జున హోస్ట్ గా 19 మంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభమైన వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌-5’  ఫైనల్స్ కు సర్వం సిద్ధమవుతోంది.

సుమారు 104 రోజులుగా ప్రేక్షకుల్ని అలరిస్తోన్న ఈ షో గ్రాండ్‌ఫినాలే ఆదివారం సాయంత్రం ప్రసారం కానుంది. టాప్ 5లో ఉన్న‌ మానస్‌, శ్రీరామ్‌, సన్నీ, షణ్ముఖ్‌, సిరిలలో ఫైనల్ విన్నర్ ఎవరనేది ఇప్పటికే సోషల్ మీడియాలో రచ్చ అవుతోంది. గ్రాండ్ ఫినాలేలో విన్నర్ – రన్నర్ తో పాటుగా ఎవరి ప్లేస్ ఏంటనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక హౌస్ లో ఉన్న ఐదుగురిలో ఒకరు విజేత కానున్నారు. సిరి, షణ్ముఖ్, సన్నీ, శ్రీరామ్, మానస్ ఈ ఐదుగురిలో ముందుగా ఇద్దరు బయటకు వెళ్ళిపోతారు. ఇక మిగిలిన ముగ్గురిలో ఒకరు విన్నర్ అవుతారు. ఎవరు బిగ్ బాస్ ట్రోఫీని అందుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

తాజాగా విడుదలైన ప్రోమోలో నాగార్జున ఎప్పటిలాగే వీక్షకుల్లో ఉత్సాహాన్ని పెంచేస్తూ “వెల్కమ్ టు ద గ్రాండ్ ఫినాలే” అంటూ స్టార్ట్ చేశారు. ఇక హౌస్ మేట్స్ తో “టునైట్ మీరు స్టార్స్ కానీ… మీరు చాలామంది స్టార్స్ ని చూడబోతున్నారు” అని చెప్పగా, హౌజ్ లోకి ఈరోజే రాత్రి ఎవరెవరు గెస్టులుగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే విషయంపై ప్రోమోలో క్లారిటీ ఇచ్చేశారు.

Bigg Boss Telugu 5 Grand Finale LIVE UPDATES: Alia Bhatt, Sai Pallavi & Rashmika Mandanna take over the stage | PINKVILLA

ఈ గ్రాండ్ ఫినాలేకు అతిథులుగా పలువురు హీరోహీరోయిన్లు , డైరెక్టర్లు విచ్చేశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్ నుంచి రాజమౌళి, ‘బ్రహ్మాస్త్ర’ టీమ్‌ నుంచి రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియాభట్‌, ‘పుష్ప’ ప్రమోషన్స్‌ కోసం రష్మిక, సుకుమార్‌, దేవిశ్రీ ప్రసాద్‌ స్టేజ్‌పై సందడి చేయనున్నారు. ఇక సాయిపల్లవి, నాని.. హౌస్‌లోకి వెళ్లి ఇంటి సభ్యులతో సరదాగా మాట్లాడనున్నారు.

కాగా, కంటెస్టెంట్‌ల ఇంటిసభ్యులు, ఎలిమినేటై ఇంటికి వచ్చిన తోటి కంటెస్టెంట్స్‌ల డ్యాన్స్‌లు, పాటలతో ఈ వేడుకను మరింత సందడిగా మార్చినట్లు  ప్రోమోతో క‌నిపిస్తుంది.  ఈ షోలో విజేత ఎవరో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

Related posts