telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

భారత్ కు వార్నింగ్ ఇస్తున్న అమెరికా….

india usa flag

అమెరికా-భారత్ చాలా ఏళ్ళ నుండి మంచి సంభందని కొనసాగిస్తున్నాయి. అయితే ఇప్పుడు అమెరికా భారత్ కు హెచ్చరికలు ఇస్తుంది. ఏం జరిగిందంటే… పొరుగుదేశాలతో ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకొని ఇండియా ఆయుధాలను సమకూర్చుకుంటున్న సంగతి తెలిసిందే.  రక్షణ పరంగా మరింత బలంగా మారేందుకు భారత్ ప్రయత్నం చేస్తున్నది. ఒకవైపు స్వదేశీయంగా ఆయుధాలను తయారు చేసుకుంటూనే, ఇతర దేశాల నుంచి అత్యాధునిక ఆయుధాలను కూడా కొనుగోలు చేస్తోంది.  ఇందులో భాగంగానే 2018 వ సంవత్సరంలో ఇండియా, రష్యా దేశాల మధ్య ఓ రక్షణ ఒప్పందం కుదిరింది.  ఎస్ 400 ట్యాంకులను కొనుగోలు చేసేందుకు ఒప్పందం జరిగింది.   ఈ ఒప్పందం విలువ 5 బిలియన్ డాలర్లు.  అడ్వాన్స్ రూపంలో ఇప్పటికే ఇండియా 800 మిలియన్ డాలర్లు చెల్లించింది.  ఇండియా, రష్యా మధ్య జరిగిన ఈ ఒప్పందాన్ని అమెరికా అంగీకరించడం లేదు.  రక్షణ చట్టాలను విరుద్ధంగా ఈ ఒప్పందం ఉందని, ఇండియా కనుక రష్యా నుంచి ఎస్ 400 ట్యాంకులను కొనుగోలు చేస్తే సిఏఏటిఎస్ కింద ఆంక్షలు విధిస్తామని తెలిపింది.  అయితే, భారత్ మాత్రం అమెరికా హెచ్చరికలను ఖాతరు చేయడం లేదు.  ఏ దేశం నుంచి ఆయుధాలు కొనుగోలు చేయాలన్నది భారత్ రక్షణ వ్యవస్థకు సంబంధించిన విషయం అని స్పష్టం చేసింది.  గతంలో ఇలాంటి ఆయుధాలైన థాట్, పేట్రియాట్ మిస్సైళ్ళను ఇండియాకు అమ్మాలని అమెరికా చూసింది.  అయితే, ఎస్400 వీటికంటే అత్యాధునికమైనవి కావడంతో రష్యా వైపు మొగ్గు చూపింది ఇండియా. చూడాలి మరి మళ్ళీ అమెరికా ఏ విధంగా స్పందిస్తుంది అనేది.

Related posts