telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

10వ‌ తరగతి పరీక్షల నిర్వహణ పై ఏపీ విద్యాశాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు…

Adimulapu sures

కరోనా విజృంభ‌ణ కొన‌సాగుతున్నా.. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌మే మొగ్గు చూపుతుంది ఏపీ స‌ర్కార్. కానీ, దీనిపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయితే కోవిడ్ ప‌రిస్థితుల్లో ఆరోగ్య భద్రత ప్రభుత్వం తీసుకుంద‌న్న మంత్రి ఆదిమూల‌పు సురేష్… మూడు యూనివర్సిటీలను ఉన్నత స్థాయిలో నిలపాలని ప్రభుత్వం సంకల్పించింద‌న్నారు.. విద్యా ప్రమాణాలు ఎలా వున్నాయో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వ‌హించామ‌న్న ఆయ‌న‌.. గత ప్రభుత్వం సాంకేతిక విద్య విషయంలో వైఫల్యం చెందింద‌ని విమ‌ర్శించారు.. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయో దేశం అంతా కన్పిస్తున్నాయి.. కానీ, తెలుగుదేశం పార్టీ వారికి కనిపించటం లేద‌ని మండిప‌డ్డ ఆయ‌న‌.. రాష్ట్రంలో పవన్, చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారంటూ ఫైర్‌ అయ్యారు.. వారి మూలంగా దేవాలయం లాంటి యూనివర్సిటీల గురించి మాట్లాడాల్సి వ‌స్తుంద‌న్నారు. ఇక‌, 10 తరగతి పరీక్షలు 11 సబెక్టులు ఉంటే 7 కి కుదించి నిర్వహిస్తున్నామ‌ని గుర్తు చేసిన మంత్రి.. ప్రతిపక్షాలు దీని పై రాజకీయాలు మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు.

Related posts