telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బుల్లితెరపై “సైరా” ఫ్లాప్ కు కారణమిదేనా ?

Syeraa

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవితకథ ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం `సైరా`. గతేడాది విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్ బిగ్‌హిట్‌లలో ఒకటిగా నిలిచింది. మెగాభిమానులను విపరీతంగా అలరించింది. వెండితెరపై అంతటి విజయం సాధించిన ఈ చిత్రం బుల్లితెరపై మాత్రం ఆశించిన స్థాయిలో టీఆర్పీలు సాధించలేకపోయింది. సంక్రాంతి సందర్భంగా ఓ ఛానెల్‌లో `సైరా` సినిమా ప్రసారమైంది. ఈ సినిమా కనీసం 20 టీఆర్పీ సాధిస్తుందని అంచనా వేసుకున్నారు. అయితే కేవలం 11.8 టీఆర్పీ మాత్రమే సాధించగలిగింది. బుల్లితెర కంటే ముందు అమెజాన్ ప్రైమ్‌లో వచ్చేయడం వల్లే టీవీల్లో `సైరా`ను వీక్షించేందుకు ప్రేక్షకులు ఇష్టపడలేదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వెండితెరపై చూసేసిన, అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉన్న సినిమాను మళ్లీ బుల్లితెరపై వీక్షించేందుకు ప్రేక్షకులు సిద్ధపడలేదు. దీంతో `సైరా`ను ప్రదర్శించిన చానెల్‌కు నిరాశే మిగిలింది.

Related posts