telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆర్‌ఆర్‌ఆర్‌ టీంలో జాయిన్‌ అయిపోయిన బాలీవుడ్‌ భామ

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ “‘రౌద్రం రణం రుధిరం”. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో సీత పాత్రలో రామ్‌‌చరణ్‌కు జోడీగా ఆలియా నటిస్తోంది. అలాగే ఎన్టీఆర్ సరసన బ్రిటీష్ భామ పాత్ర లో హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్ నటిస్తుంది. అయితే.. తాజాగా బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఆలియా భట్ ఆర్‌ఆర్‌ఆర్‌ టీంలో చేరింది. ఇవాళ్టి నుంచి షూటింగ్‌లో పాల్గొననుంది. అయితే.. ఇవాళ్టి నుంచి ఆలియా- చెర్రీ మధ్య కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఆలియా సీత పాత్రలో నటించనుంది. ప్రస్తుతం మహాబలేశ్వర్‌ ప్రాంతం లో ప్రకృతి అందాల మధ్య షూటింగ్‌ జరుగుతోంది.

Related posts